బీసీసీఐ కలుగజేసుకోవడంతో టీమిండియా బౌలర్ షమీకి వీసా ఇచ్చిన అమెరికా

  • షమీపై గృహహింస కేసు
  • వీసా మంజూరు చేయలేమన్న అమెరికా రాయబార కార్యాలయం
  • బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ జోక్యంతో వీసా మంజూరు
భారత జట్టు ప్రధాన బౌలర్లలో ఒకడైన మహమ్మద్ షమీకి అమెరికా వీసా నిరాకరించగా, ఆపై బీసీసీఐ జోక్యంతో వీసా మంజూరైంది. షమీపై పోలీసు కేసులు ఉండడమే అమెరికా వీసా నిరాకరణకు కారణంగా తెలుస్తోంది. షమీపై గతేడాది భార్య హసీన్ జహాన్ కోల్ కతా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు షమీపై గృహహింస కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ వ్యవహారం విచారణలో ఉండడంతో తాము షమీకి వీసా మంజూరు చేయలేమంటూ అమెరికా రాయబార కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

అయితే, షమీ అంతర్జాతీయ క్రీడాకారుడు అని, అతనికి పీ1 కేటగిరీలో వీసా మంజూరు చేయాల్సిందిగా బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ అమెరికన్ ఎంబసీకి లేఖ రాశారు. దాంతో షమీకి వీసా మంజూరైంది. త్వరలోనే వెస్టిండీస్ పర్యటనకు వెళుతున్న టీమిండియా తొలుత అమెరికాలో విండీస్ జట్టుతో రెండు టి20 మ్యాచ్ లు ఆడనుంది.
Go Back to Shorts
Shami
Visa
USA
BCCI

More Telugu News